రూపకం చూసినంత సేపు దేవతలే దిగివచ్చి నృత్యం చేసినట్టుగ వుంది. బాల్యంలో కళాక్షేత్రలో ఇటువంటి సంగీత నృత్య కార్యక్రమాలు చూస్తూ పెరిగాను. ఈ తరహా కళల ప్రదర్శనలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం వుంది. యువత పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులు అయ్యి , సాంప్రదాయ కళలను విస్మరిస్తున్నారు. మన సంస్కృతి పట్ల పిల్లలు ఆసక్తి పెంపొందించుకోవాలి.కల ప్రదర్శనలు ప్రతి వూళ్ళో జరగాలని అభిలషిస్తున్నాను.