తెలంగాణలోనే ప్రాచీన పురాతన దేవాలయాలను వేదికగా మలచి, నిర్వహించిన నాట్యప్రదర్శన ఎంతో కన్నుల పండుగగా జరిగింది. అందరికి అరుదుగా దొరికే ప్రత్యేకమైన సాంప్రదాయ నృత్యాలు ఆహుతులు అందరిని ఎంతగానో అలరించాయి. ఒడిసి నృత్యాలు అందరిని రంజింపచేశాయి. నగరానికి దూరంగా ప్రకృతి మధ్యలో గుడి ముంగిట రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ నిర్వహించబడ్డ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించబడిన పరంపరా నిర్వాహకులైన శ్రీ శశి రెడ్డి గారిని, శ్రీనాగి గారిని మనస్ఫూర్తిగా అభినందించవలసింది.